17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

న్యూ ఇయర్ వేడుకల్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్

28-12-2025 12:00 AM
  1. మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవు

ఇన్‌స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ 

ఉప్పల్, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : న్యూ ఇయర్ వేడుకల్లో అధికంగా మద్యం సేవించి వాహనం నడిపితే ఉపేక్షించలేదని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ కూడా హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహ నం నడిపి మీ అమూల్యమైన ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. పోలీసులు శిక్షించేది కాదు రక్షించే అందుకే ఆంక్షలు పెట్టామని నియమాలు పాటిస్తే న్యూ ఇయర్ ఆనందంగా గడుస్తుందని ఆయన తెలిపారు నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలని ఆయన సూచించా రు.

సీట్ బెల్ట్ వాహనదారులు హెల్మెట్లు ను ధరించాలన్నారు. గుంపులు గుంపులుగా నిలబడి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. డీజే లు మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టి పక్కవారిని ఇబ్బంది పెట్టొద్దని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి వహించాలని డ్రగ్స్ గంజాయి మారక ద్రవ్యాలు వినియోగిస్తే చర్యలు తప్పవు అన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ద్విచక్ర వాహనాలు కార్లు భారీ వాహనాలు కూడా తనిఖీ నిర్వహించబడతాయని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు చేసి నిబంధనలు ఉల్లగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.