calender_icon.png 28 December, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఏ కులాలకు అన్ని పార్టీలు వాటా కల్పించాలి

28-12-2025 12:00:00 AM

తెలంగాణ బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. భాగయ్య

ముషీరాబాద్,  డిసెంబర్ 27 (విజయక్రాంతి): రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ ఏ కులాలకు జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు వాటా కల్పించాలని తెలంగాణ బీసీ ‘ఏ‘ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. భాగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బాగ్లింగంపలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో తెలంగాణ బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం. బాగ య్య మాట్లాడుతూ బీసీఏ కులాలకు రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేకుండా పోతుందని, 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ కులాలకు ఏ పార్టీలు ఒరగ బెట్టిందేమీ లేదన్నారు. ఓసీలకు తాము వ్యతిరేకం కాదని జనాభా దామాషా ప్రకా రం తమ కులాలకు మేమెంతో మాకంత వాటా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ ఏ కులాల అందరూ కలిసి తమ హక్కు ల సాధన కోసం ఉద్యమించాలన్నారు.

త్వరలో పెద్ద ఎత్తున బిసి కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు  ఆయన వెల్లడిం చారు. ఈ సమావే శంలో సమితి ప్రతినిధులు గడప శ్రీహరి, వీర స్వామి, సుధాకర్, రామానంద స్వామి,  చింతల కృష్ణ, రాకేష్ నాయి, రామచందర్, ఆశన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.