calender_icon.png 3 December, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

03-12-2025 12:53:57 AM

హెలెన్ కిల్లర్ సంస్థలో నేటి నుంచి 10 వరకు నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత  వైద్య శిబిరం డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 10 వరకు హెలెన్ కిల్లర్ సంస్థ శ్రీనగర్ కాలనీ నేరేడ్మెట్ సికింద్రాబాద్ నందు నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ పటాన్ ఉమర్‌ఖాన్ తెలిపారు.

ఉచితంగా బధిరులు, మానసిక దివ్యాంగులు, వినికిడి లోపం సంబంధించిన సమస్యలు, స్పీచ్ తెరపి, మాటలు తడబడటం వివిధ సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. మాన సిక దివ్యాంగులకు ఐక్యూ పరీక్ష ప్రవర్తన పరీక్షలు నిర్వహిస్తారని, 3 సంవత్సరాల పిల్లల నుంచి వృ ద్ధుల వరకు ఉద యం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.