03-12-2025 12:52:46 AM
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో జోయల్‌కు ఫస్ట్ ప్రైజ్
కరీంనగర్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో కోట పబ్లిక్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థి కొమ్ము జోయల్ ప్రథమ బహుమతి దక్కించుకున్నాడు. ‘నీటి సంరక్షణ నిర్వహణ (నది శుద్ధీకరణ)” అంశంపై జోయల్ రూపొందించిన ప్రాజెక్టు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకొని అందరి ప్రశంసలు పొందింది.
ఈ విజయంతో అతడు రాష్ర్టస్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపిక అయ్యాడు. కోట రెసొనెన్స్ జూనియర్ కళాశాలలు, కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి జోయల్‌ను మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో అభినందించారు.
విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు విద్యాసంస్థల్లో తమ వంతు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు. జోయల్ సాధించిన ఈ విజయంతో పాఠశాల పేరు మరింత ఎత్తుకు వెళ్లిందని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని కోట పబ్లిక్ స్కూల్‌లో జరిగిన అభినందన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.