calender_icon.png 3 December, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్సే దేవా లొంగిపోలేదు

03-12-2025 12:54:15 AM

  1. కొన్ని పత్రికలు, ఛానళ్లలో తప్పుడు ప్రచారం

సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌవాన్, బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పట్టలింగం

చర్ల, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సే దేవా (పీఎల్‌జీఏ బెటాలియన్ 1 కమాండర్) లొంగిపోలేదని, కొన్ని పత్రికలు, ఛానళ్లలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టలింగం మంగళవారం స్పష్టం చేశారు.

లొంగుబాటు, పునరావాస విధానం కింద నిరంతర ప్రయత్నాలు బస్తర్ రేంజ్‌లో గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయని, గత రెండు నెలల్లోనే 570 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టి జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. బర్సే దేవా, పప్పారావు, దేవ్‌జీ వంటి మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు. హింస, సంఘర్షణ మార్గంలో కొనసాగడం వల్ల వారికి లేదా ఇతర కార్యకర్తలకు ప్రయోజనం ఉండదన్నారు.