మండలంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారి ప్రవీణ్ తనిఖీలు
జక్రన్ పల్లి, మార్చి 13(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా జక్రన్ పల్లి మండలములో ప్రత్యేక అధికారి కె. ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పనుల నిర్వహణతో పాటు 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో జరుగుతున్న పనులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జక్రాన్పల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ను పరిశీలించారు.
అనంతరం ఎంఫిపిఎస్ పాఠశాల, భవిత స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.తదుపరి పడకల్ నర్సరీ, పడకల్ హైస్కూల్ను సందర్శించి, ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థుల సిద్ధతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పడకల్ నర్సరీని సందర్శించి తగు సూచనలు ఇచ్చారు.
అనంతరం ప్రభుత్వ పీహెచ్సీ కేంద్రాన్ని తనిఖీ చేసి పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై గ్రామపంచాయతీ సిబ్బందికి సూచనలు చేశారు. రేపు నిర్వహించనున్న హెల్త్ క్యాంప్పు వైద్యులు సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పడకల్ జక్రాన్పల్లి పాఠశాల హెచ్‌ఎంలు, ఏపీవో, ఎంఫిపిఎస్ హెచ్‌ఎం, ఏఈ (ఎస్‌ఎస్‌ఏ), పంచాయతీ సెక్రటరీ, ఎఫ్‌ఏ సిబ్బంది పాల్గొన్నారు.




