14 March, 2026 | 5:16 AM

ఇష్టానుసారంగా సిలిండర్లతో వ్యాపారం

14-03-2026 12:13 AM
  1. అక్రమంగా వాడుతోన్న పట్టించుకోని పౌరసరఫరాల శాఖ

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవాలి

సికింద్రాబాద్, మార్చి13 (విజయక్రాంతి): గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లలో దాదాపు 86 శాతం డొమెస్టిక్ కనెక్షన్లేనని, అలాగే మిగిలిన 14 శాతం మాత్రమే కమర్షియల్ అని ప్రస్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లై) అధికారులు చెబుతున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సర్కిల్ 8 పరిధిలో బోయిన్ పల్లి, మారేడుపల్లి సికింద్రా బాద్ మోండా, తిరుమలగిరి ప్రాం తాలలో హోటళ్లు,స్వీట్ షాప్ లు, హాస్టల్స్, మెస్, కర్రీ పాయింట్, టీ షాపుల లో అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లు వాడుతోన్న పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లై) అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు అన్ని స్థానిక ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ కొరత తీవ్రంగా ఉంది.కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడవలసిన ఉన్న హోటళ్లు,హాస్టల్స్, స్వీట్ షాపులు, మెస్, కర్రీ పాయింట్, టీ షాపులలో నిత్యం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు.

వీరికి ప్రతిరోజు వివిధ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు డెలివరీ బాయ్స్ సప్లై చేస్తున్నారు.దీని పై పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లై)అత్యవసర వస్తువుల చట్టం, 1955 లోని సెక్షన్ 6-A కింద కేసులు నమోదు చేసి అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.