14 March, 2026 | 2:42 AM

కుల గణనతోనే సామాజిక న్యాయం

14-03-2026 12:12 AM

పుస్తకావిష్కరణలో పలువురు వక్తలు

ముషీరాబాద్, మార్చి 13(విజయక్రాంతి): ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఒబిసిఎస్‌ఎ) ఆధ్వర్యంలో ’క్యాస్ట్ సెన్సెస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ అనే పుస్తకాన్ని పలువురు రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా న్యూఢిల్లీలోని కాని స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పీకర్స్ హాల్లో ఘనంగా ఆవిష్కరించినట్లు జాతీయ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎఐఒబిసిఎస్‌ఎ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, డా. వాహిని బిళ్లు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకాన్ని లోక్సభ సభ్యుడు మల్లు రవి, రాజ్యసభ సభ్యులు పి. విల్సన్, ఆర్. కృష్ణ య్య, సంజయ్ సింగ్, ఓబీసీ హక్కుల ఉద్యమ నాయకురాలు రత్నా సెతుపతి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ప్రొ.సూరజ్ మండల్, ప్రొ.సందీప్ యాదవ్, అడ్వకేట్ శశాంక్ రత్నూ సంయుక్తంగా ఆవిష్కరించినట్లు చెప్పరు.

కుల గణన, సామా జిక న్యాయంపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఈ పుస్తకం మేధోపరమైన తోడ్పాటుగా నిలుస్తుందని అతిధులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. దేశంలో కుల గణన అవసరం, సామాజిక న్యాయం పోషించే పాత్రపై విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, బ్యూరోక్రాట్లు, పరిశోధకులు, విద్యా ర్థుల అభిప్రాయాలను ఈ గ్రంథం సమగ్రంగా సమీకరించిందని తెలిపారు.