తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీ
23-05-2026 03:04 PM
ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ మొదటి డిపో నుండి తీర్థయాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలో సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ విజయ మాధురి తెలిపారు. మే 27 బుధవారం కరీంనగర్ బస్టాండ్ నుండి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి అన్నవరం, సింహాచలం, పిఠాపురం, వైజాగ్ బీచ్, ద్వారకాతిరుమల దర్శనాల తదుపరి మే 29 శుక్రవారం రాత్రి వరకు కరీంనగర్ చేరుకుంటుందని చెప్పారు. ఇట్టి బస్సు పెద్దలకు 3,500/- పిల్లలకు 2625/- టిక్కెట్ గా నిర్ణయించ బడినది. మరిన్ని వివరాలకు 73828 49352, 9959225920, 80746 90491, సంప్రదించగలరని డిపో మేనేజర్ తెలిపారు.






