23 May, 2026 | 4:32 PM

రోడ్ ఎక్కిన ధాన్యం రైతులు

23-05-2026 03:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): పంట కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం కొనుగోలు ఓల్డ్ సంచులు లారీల కొరత పరిష్కరించాలని కోరుతూ శనివారం కుంటాల మండలంలోని అందాకూరు గ్రామ రైతులు నిరసన తెలిపారు. కుంటాల కల్లూర్ రహదారిపై బైఠాయించిన రైతులు పంట కొనుగోలు జాప్యం చేయడం వల్ల రైతులకు తీవ్రతం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు గోని సంచులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై అశోక్ ఆర్ ఐ సందర్శించి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇస్తామని చెప్పిన లారీలు వచ్చేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు నిరసన తెలుపుతున్నారు.