సుల్తానాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
- పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
పెద్దపల్లి (విజయక్రాంతి)/మంథని, జూన్ 26: సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం ఆయన సుల్తానాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఏడు షాపింగ్ షట్టర్స్ కాంప్లెక్స్‌ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుల్తానాబాద్ పట్టణ పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరు అభివృద్ధికి సహకరించాలని కోరారు. దుకాణ సముదాయంలోని గదులను ఓపెన్ టెండర్ ద్వారా కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్‌ఆర్‌ఐ ముద్దసాని సుధీర్‌రెడ్డి సమకూర్చిన బ్యాగులను, నోట్ బుక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మినుపాల స్వరూపరాణి ప్రకాష్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మిరాజమల్లు పాల్గొన్నారు.






