25 April, 2026 | 6:54 AM

హత్యలు, దోపిడీలు చేసింది నీ కుటుంబం కాదా?

27-06-2024 12:05 AM
  • మతి భ్రమించి మంత్రి శ్రీధర్‌బాబుపై విమర్శలు
  • పుట్ట మధుపై కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం ఫైర్

మంథని, జూన్ 26: “మంథని నియోజవర్గంలో హత్యలు, దోపిడీలు చేసింది నీ కుటుంబం కాదా, గట్టు దంపతులను హత్య నీది కాదా“ అంటూ పుట్ట మధుపై కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు, ముత్తారం మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం మండిపడ్డారు. బుధవారం ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుట్ట మధుకు మతి భ్రమించి మంత్రి శ్రీధర్‌బాబు ఆయన తమ్ముడు శ్రీనుబాబుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.

మంథనిలో అక్రమంగా మట్టి, ఇసుక దందాలు నడుస్తున్నాయని ఆరోపించడం సరికాదన్నారు. నియోజవర్గంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెక్ డ్యాముల పేరటి మానేరు, గోదావరి నదులపై ఇసుక క్వారీలు తీసుకువచ్చి ఇసుక దోపిడీ చేసిందని విమర్శించారు. పేదింటి బిడ్డున పుట్టకు ఇంద్రభవనం లాంటి ఇల్లు, వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజయ్య, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు వాజీజ్‌పాషా, నాయకులు సమ్మయ్య, శ్రీను, చంద్రమౌళి, రాజిరెడ్డి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.