కెసిఆర్ కాలనీలో గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
26-06-2026 04:06 PM
రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట మున్సిపల్ పరిధిలోని టు బిహెచ్కె కేసీఆర్ కాలనీలో గ్రామ దేవతకు కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కాలనీ ముఖద్వారమైన కేసీఆర్ కమాను వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన గ్రామ దేవతకు వేద బ్రాహ్మణుడు కూర్మాచలం శ్రీనివాస్ ఆచార్యులచే కాలనీ చైర్మన్ కట్ట ప్రభాకర్ కాలనీవాసులతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారికి కాలనీవాసులు మంగళహారతులు నైవేద్యాలను సమర్పించారు. అనంతరం వేద బ్రాహ్మణుడు కాలని వాసులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.






