8 August, 2026 | 9:45 AM

"సహచరి"ప్రతి ఇంటికి జీవన దీపం... రక్షా కవచం

08-08-2026 08:51 AM

స్వయం సహాయక సంఘాల సభ్యులను... కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడమే పోలీసుల ప్రధాన లక్ష్యం.                    

అడిషనల్ డీసీపీ ఎన్. నర్సింహారెడ్డి (ఎస్ఓటి)

జవహర్ నగర్ ఆగస్టు 7 (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాల సభ్యులకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా(Community Safety Ambassadors) తీర్చిదిద్దడమే పోలీసుల ప్రధాన ధ్యేయమని అడిషనల్ డీసీపీ ఎన్. నరసింహారెడ్డి పేర్కొన్నారు. పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సూచనతో శుక్రవారం సహచరి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ ఎం నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ మహిళలు పిల్లల వృద్ధులు భద్రత నేరాల నివారణ ట్రాఫిక్ భద్రత సైబర్ భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పోలీస్ ప్రజల భాగస్వామ్యాన్ని బలోపితం చేయడమే ప్రధాన ఉద్దేశం అన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  2024 నుండి అమలులోకి వచ్చిన భారతీయ నూతన క్రిమినల్ చట్టాలు దేశంలోని న్యాయవ్యవస్థను మరింత ఆధునికంగా పారదర్శకంగా సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో రూపొందించబడ్డాయని అన్నారు. అలాగే ప్రజలకు సులభమైన మర్యాదగాపూర్వకమైన వేగవంతమైన పోలీస్ సేవలు అందించడమే ప్రధాన బాధ్యత అన్నారు. అనంతరం  నేను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్ గా నా గ్రామం కాలనీలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలు పిల్లలు వృద్దుల బాధ్యత కు భద్రతకు కృషి చేస్తానని నేరాల నివారణలో పోలీసులకు సహకరిస్తానని సైబర్ మోసాలు మాదకద్రవ్యాల నిర్మూలన ట్రాఫిక్ భద్రతపై ప్రజలను చైతన్యవంతులను చేసి శాంతియుత సురక్షిత సమాజ నిర్మాణానికి నా వంతు బాధ్యత ని బాధతో నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఏసీబీ చక్రపాణి, జవహర్ నగర్ ఎస్హెచ్ఓ సైదులు, ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్  జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.