ఆర్టీసీ తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజ్
ముకరంపుర,(విజయక్రాంతి): బోనాల పండుగ సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ ఒకటవ డిపో నుండి తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీని డిపో మేనేజర్ విజయ మాధురి ప్రకటించారు.తీర్థ యాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీలో బోనాల సందర్భంగా కరీంనగర్ 1 డిపో సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ టెంపుల్స్ దర్శనం కొరకు ఈనెల 9ఆదివారం రోజున కరీంనగర్ బస్టాండ్ నుండి ఉదయం 3.30కి బయలుదేరి శ్రీ నిమిషాంబిక టెంపుల్, శ్రీ అష్టలక్ష్మి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, శ్రీ జగన్నాథ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్స్ లో దర్శనాలు చేసుకునే అవకాశం కల్పించింది. దర్శనాల తదుపరి బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుతుందని అధికారులు తెలిపారు.ఇట్టి బస్సు పెద్దలకు రూ.1300గా పిల్లలకి 975గా నిర్ణయించబడినది. మరిన్ని వివరాల కొరకు 73828 49352, 9959225920 ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని డిపో మేనేజర్ తెలియజేశారు.






