11 March, 2026 | 9:46 PM

పరిశుభ్రతను పాటిద్దాం

11-03-2026 08:16 PM

మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ పాల్గొన్నారు. పట్టణంలోని 4వ వార్డులో బుధవారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు రోడ్లపై, నాళాల్లో చెత్త వేయకుండా చెత్త బండిలో వేయాలని సూచించారు.

ప్రజల సహకారంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్యంలో ముందంజలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, 4వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, బీఆర్‌ఎస్ నాయకులు సాయి శ్రవణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.