అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
- మహా పడి పూజలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
- అయ్యప్ప స్వామివారికి 50 తులాల వెండి సమర్పణ
- మెదక్ లో ఘనంగా అయ్యప్ప స్వామి రజతోత్సవాలు
మెదక్,(విజయక్రాంతి): అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. మెదక్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రజతోత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన మహా పడి పూజ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ మాధవ నంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... మెదక్ అయ్యప్ప స్వామి దేవాలయంలో రజతోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయాలు ఆధ్యాత్మిక చింతనకు కేంద్రాలుగా నిలుస్తూ సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ రజతోత్సవాల విజయవంతానికి కృషి చేస్తున్న అయ్యప్ప భక్త సేవా సమాజం సభ్యులను, భక్తులను అభినందించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి 50 తులాల వెండిని సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వైద్య రాజు పంతులు పద్మాదేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.






