27 August, 2026 | 7:56 AM

ఎర్రుపాలెం చంద్రమౌళీశ్వర స్వామి భూముల సర్వే

20-06-2026 09:09 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం గ్రామంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం భూములు రీ సర్వే చేపట్టినట్లు దేవస్థానం చైర్మన్ మగినం జయశ్రీ తెలియజేశారు. శనివారం నాడు కేసిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం భూములను రెవెన్యూ సర్వేయర్ సమత భూములను రీ సర్వే చేసి 27 ఎకరాల 17 గుంటలుగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రామకోటేశ్వరరావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, ‌ గ్రామ పెద్దలు జమలాపురం కమలాకర్ బాబు, శ్రీనివాసరావు, రైతులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.