15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు

05-02-2026 12:00 AM

ఎన్నికల సూపరింటెండెంట్ జగత్ సింగ్ 

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లకు బుధవారం ఎన్నికల సూపరిడెంట్ జగత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు హనుమకొండ జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 244 బూత్ ఏజెంట్లు, 26 డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బూతులు ఏజెంట్లు, బూతు లెవల్ అధికారులతో (బిఎల్‌ఓ) కలిసి తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగా ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయాల్సిందిగా సూచించారు.

ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్లు, ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు ఉండకుండా డబల్ లేదా డూప్లికేట్ ఓటర్లను గుర్తించాలని అధికారులు వివరించారు. ఈ ప్రక్రియ రాబోయే స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కు ముందస్తు సిద్ధత అత్యంత కీలకమని తెలిపారు. ఓటర్ లిస్టును శుద్ధి చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో పారదర్శకత, నిష్పాక్షపాతత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మార్గదర్శకాలు, సూచనల మేరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ, కాజీపేట తహసిల్దార్లు గుజ్జుల రవీందర్ రెడ్డి, రాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, ఏనుగుల మానస రాంప్రసాద్, విజయలక్ష్మి సురేందర్, సోషల్ మీడియా ఇన్చార్జులు కేతిడి దీపక్ రెడ్డి, ఎం.డి నేహాల్, పలు డివిజన్ల అధ్యక్షులు ఎనుకొంటి పున్నం చందర్, తాళ్లపల్లి సుధాకర్, తడుక సుమన్ గౌడ్, రవి కిరణ్, బూతు లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.