18 August, 2026 | 7:52 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

18-08-2026 07:17 PM

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు, షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్‌లు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా, జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న విజేతలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడారంగంలో వారు కనబరిచిన అంకితభావం, పట్టుదల, కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి, ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి  ఆకాంక్షించారు.