2 May, 2026 | 7:06 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

సభ్యత నమోదు కార్యక్రమాన్ని వేగవతం చేయండి

27-10-2024 05:09 PM

సభ్యత్వ ఇన్చార్జి, కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో సభ్యత్వ కార్యక్రమం వేగవంతం చేయాలని కిసాన్ మోక్షా రాష్ర్ట అధ్యకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం అసెంబ్లీ కన్వీనర్ తిమ్మిరి నరేందర్ బాబు అధ్యక్షతన పాల్వంచ పట్టణంలోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బిజెపి స్టేట్ లోకల్ బాడీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ తాండ్ర వినోద్ రావు మరియు ఐకార్ మెంబర్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. అసెంబ్లీలో ఇప్పటివరకు సభ్యత్వ నమోదు విజయవంతంగా చేసిన సందర్భంగా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు, అదేవిధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు  చేయాలని, సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోవాలని జిల్లాలోనే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయాలని కార్యకర్తలకు దిషా నిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ నాపై గురుతర భాధ్యత పెట్టిందని కార్యకర్తలు అందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని, ఏ పార్టీకైన పునాది సభ్యత్వాలే కనుక నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొని అత్యధిక సభ్యత్వాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండ్ర వినోద్ రావుని స్టేట్ లోకల్ బాడీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ గా నియమించినందుకు జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ వారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఐకార్ బోర్డు మెంబర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మనోహర్, పార్లమెంట్ కో కన్వీనర్ జల్లరపు శ్రీనివాస్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వంశి, బుడగం రవి, యడ్లపల్లి  శ్రీనివాస్ భూక్యా సీతరామ్ నాయక్,  ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్, రమేష్ బాబు, కటికాల రంజిత్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.