11 March, 2026 | 2:31 PM

Breaking News

పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •  

సైకాలజిస్టుల కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి

27-10-2024 05:19 PM

తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రాంచందర్

కరీంనగర్ (విజయక్రాంతి): సైకాలజిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వ వెంటనే  కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోతుకూరి రామచందర్ అన్నారు. ఆదివారం నగరంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ మెయిన్ క్యాంపస్ లో ఉమ్మడి జిల్లా సైకాలజిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సైకాలజిస్ట్ అవసరం ప్రతి వ్యక్తికి ఉందని, పాఠశాలల పాటు అన్ని కళాశాలలో సైకాలజిస్టులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మానసిక వైకల్యం లేదా మానసిక ఆలోచన వైకల్యం కలవారిని బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురు తర బాధ్యత సైకాలజిస్ట్స్ లపై ఉందని అన్నారు. ప్రతి సైకాలజిస్ట్ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. సైకాలజిస్ట్ సమర్థవంతంగా తన బాధ్యత నిర్వహిస్తే సమాజం సుభిక్షితంగా ఉంటుందని అన్నారు. మానసిక రోగులు లేని సమాజం కోసం పాటుపడాలని కోరారు. లీడర్ షిప్ లక్షణాలు సమాజంలో అనేక మందిని లీడర్ ను తయారు చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పున్నం చందర్, జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం, ఈశ్వర్, సతీష్, అనురాధ, భూమేష్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.