30 July, 2026 | 2:49 PM

అనాధ పిల్లలకు అండగా ఎస్పీఎఫ్ ట్రస్ట్

30-07-2026 02:02 PM

25 వేల రూపాయల ఆర్థిక సహాయం

మానకొండూరు, జూలై 30 (విజయక్రాంతి): అనాధలైన పిల్లల విద్యాభ్యాసం, కోసం రూపాయలు 25, 000 అందించి, వారికి అండగా, భవిష్యత్తుకు బాసటగా నిలిచింది ఎస్పీఎఫ్ ట్రస్ట్. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొండ్ర ఆద్యశ్రీ, కొండ్ర అయాన్స్  ఇద్దరు అనాధ పిల్లలకి శ్యాం ప్రసాద్ లాల్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ (ఎస్పీఎఫ్ ట్రస్ట్) కన్వీనర్ గోనె శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు చిటికెన కృష్ణకుమార్ అనాధ పిల్లలను మానకొండూరులో కలిసి వారి చదువు నిమిత్తము రూపాయలు 25వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు. గత రెండు సంవత్సరాల క్రితం మానకొండూరు మండల కేంద్రానికి చెందిన కొండ్ర పవన్ కళ్యాణ్ , కొండ్ర ప్రహర్ష  దంపతులు అకాల మరణం చెందారు.

వారి ఇద్దరు పిల్లలు అనాధలైన విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకొన్న తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్  జీవి శ్యాం ప్రసాద్ లాల్ ఐఏఎస్,   స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వేణు మాధవ్ రెడ్డిలు,స్పందించి వెంటనే మానకొండూరు మండల కేంద్రంలోని అ పిల్లలను కలిసి వారి పేరు మీద లక్ష 30 వేల రూపాయలను ఫిక్సెడ్ డిపాజిట్ చేశారు. మరో 30 వేల రూపాయలను చదువు, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం అందించారు.ప్రస్తుతం  ఎస్పీఎఫ్ ట్రస్టు కన్వీనర్ గోనె శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు చిటికెన కృష్ణకుమార్  ఎలాంటి ఆర్థిక ఆధారం లేని అనాధ పిల్లలైనా కొండ్ర అధ్యశ్రీ, కొండ్ర అయాన్స్ వారి చదువు నిమిత్తము 25వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు. కార్యక్రమం లో  పిల్లల తాత కొండ్ర లక్ష్మయ్య, కొండ్ర రాజు, కొండ్ర నాగేంద్ర బాబు,వేద హై స్కూల్ కరస్పాండెంట్ పి.శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.