ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయాన్ని ఆదివారం గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించా రు. ఎమ్మెల్యే నిధులతో గ్రామంలో నిర్మించిన మందిర్ షెడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో వెంకట్ ముండే, ఉప సర్పంచ్ డోంగ్రే కళ్యాణి సమాధాన్, జైనూర్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లాలా, సర్పంచ్ సోంబాయి నాగురావ్, ముండే సతీష్, కేంద్రే పర్సురాం, మహిళలు, పటేల్, నాయకులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




