ఆరోగ్య తెలంగాణతోనే అభివృద్ధి
09-03-2026 02:00 AM
నిర్మల్, మార్చి 8 (విజయక్రాంతి): ఆరోగ్య తెలంగాణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య అన్నారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణకు నిర్వహిస్తున్న వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా ఆరోగ్యానికి ప్రజాపాలన ప్రభుత్వం అధి క ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క రు ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, ఏరియా ఆస్పత్రి వైద్యులు డా.గోపాల్ సింగ్ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.




