10 March, 2026 | 2:34 PM

క్రీడల వల్ల మానసిక ఉల్లాసం

09-03-2026 01:57 AM

నేరడిగొండ, మార్చి 8 (విజయక్రాంతి): క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు గ్రామాల మధ్య సత్సబంధం పెరుగుతోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన మేగా క్రికెట్ టోర్నమెంట్ కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యువకులతో కలిసి బ్యాటింగ్ చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.  ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం లబిస్తోందని అన్నారు. యువకులు తీవ్రమైన ఎండల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, దేవేందర్ రెడ్డి, రాథోడ్ సురేందర్, ప్రతాప్, సాబ్లే సంతోష్ పాల్గొన్నారు.