అంత్య పుష్కరాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం
వెల్లువలా తరలివచ్చిన భక్తులు
కిటకిటలాడిన పుష్కర ఘాట్లు
వచ్చే గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం/మహబూబాబాద్, మే 31 (విజయక్రాంతి): సరస్వతి అంత్యపుష్కరాల్లో పద కొండవ రోజు ఆదివారం సెలవు కావడంతో భక్తుల వెల్లువలా పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. దీంతో త్రివేణి సంగమ క్షేత్రం భక్తుల పుణ్యస్నానాలతో కిక్కిరిసిపోయింది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుణ్యకాలాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పితృదేవతలకు తర్పణా లు సమర్పించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయి పండుగ వాతావరణాన్ని తలపించా యి. భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఘాట్ల వద్ద తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య సదుపా యాలు, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు. పోలీసు లు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రాకపోకలను సజావుగా నిర్వహించారు. అంత్యపుష్కరాల ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో కాళేశ్వరం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచింది.
కాళేశ్వరంలో మాధవానంద స్వామీజీ పూజలు
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం విచ్చేసిన మాధవనంద సరస్వతి స్వామీజీని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్క న్ సింగ్ ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యులు గొడు గు రుద్రరాజు పాల్గొన్నారు.పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల స్వామీజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. కాగా మాధవానంద సరస్వ తి పుష్కర స్నానం ఆచరించారు.
అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ భక్తులు సరస్వతి పుష్కర స్నానం ఆచరించి స్వామివారి అనుగ్రహం పొందాలని, దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాలు ప్రారంభించారని, ఈసారి గవర్నర్ చేతుల మీదుగా అంత్య పుష్కరాలుగా ప్రారంభమవడం గర్వకారణమని తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ లక్షలాది భక్తులు పాల్గొంటున్న ఈ మహోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. గత 11 రోజులుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. వచ్చే సంవత్సరం రాబోయే గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు భారీ స్థాయి లో మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు.
కాళేస్వరం దేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి 200 కోట్ల నిధు లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా జరిగాయని అభినందించారు. కాగా జెన్కో సీఎండీ కృష్ణ భాస్కర్ సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.






