calender_icon.png 7 February, 2026 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా పోటీలు ప్రారంభం

07-02-2026 08:46:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2025-26లో భాగంగా నిర్మల్ జిల్లా స్థాయి క్రీడల ఎంపిక పోటీలు వాసవి వరల్డ్ స్కూల్ సమీపంలోని క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.  జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు, 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

వాలీబాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, నెట్‌బాల్, ఫుట్‌బాల్, చెస్ తదితర క్రీడల్లో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ నిమ్మల శ్రీధర్ రెడ్డి, ఎల్లపల్లి సర్పంచ్ భీమ్ రావు, పారపెల్లి సర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి, పాత ఎల్లాపూర్ పీఈటి సంఘ ప్రతినిధులు, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.