18 April, 2026 | 10:32 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

13-06-2025 02:31 AM

ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

హనుమకొండ, జూన్ 12 (విజయక్రాంతి): వరంగల్ స్పోరట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం జేఎన్‌ఎస్ స్టేడియంలో  తెలంగాణ  ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ కు  సంబంధించి 2025-2026 సంవత్సరానికి ఇంటర్ సర్కిల్ కబడ్డీ అండ్ బాల్  బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లను ఈ నెల 12 నుండి 14 వరకు నిర్వహిస్తున్నారు.

ఈ కబడ్డీ అండ్ బాల్  బ్యాడ్మింటన్ టోర్నమెంట్   ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా  స్పోరట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన క్రీడల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల ఉద్యోగులు మానసికంగా, శారీకంగా చురుకుగా ఉంటారని, పనిలో మరింత ఉత్తేజంతో పనిచేస్తారని తెలిపారు.

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. ఆటపోటీల వలన విద్యుత్ శాఖల మధ్య మరింత స్నేహ పూర్వక బంధం బలపడుతుందన్నారు. ఈ పోటీలలో కబడ్డీ 12 జట్లు, బాల్  బ్యాడ్మింటన్ 9 జట్లు పాల్గొంటాయని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇంచార్జి డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, హన్మకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, డిఈ టెక్నికల్ ఏ.విజయేందర్ రెడ్డి, స్పోరట్స్ ఆఫీసర్ ఎన్.  జగన్నాధ్, ట్రెజరర్ ఎమ్.సంతోష్,కౌన్సిల్ మెంబెర్స్ యండి.యాకుబ్ పాషా, వి. సునీల్ కుమార్, ఈ.ప్రేమ్ కుమార్ అన్ని సర్కిళ్ల నుండి క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.