calender_icon.png 19 February, 2026 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడా పాఠశాల విద్యార్థినిలు

19-02-2026 05:34:38 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థినిలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2025 రెండవ ఎడిషన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు క్రీడాకారులు గురువారం ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ఈ పోటీల్లో మొత్తం 42 మంది విద్యార్థినులు అథ్లెటిక్స్ (9 మంది), హ్యాండ్‌బాల్ (20 మంది), ఖో ఖో (13 మంది) విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.విద్యార్థినులు క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీలకు పూర్తిగా సిద్ధమయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబ రావు, శారీరక విద్య ఉపాధ్యాయురాలు మీనా రెడ్డి తెలిపారు. సీఎం కప్ వంటి ప్రతిష్టాత్మక వేదికలో పాల్గొనడం పాఠశాలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.

గత మూడు సంవత్సరాలుగా అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, ఖో ఖో రాష్ట్ర స్థాయి పోటీలలో క్రీడా పాఠశాల విద్యార్థినులు బంగారు పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని పెంచుతున్నారని, ఈసారి కూడా అదే పరంపర కొనసాగాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు రమాదేవి ఆకాంక్షించారు. సహాయక వైద్యాధికారి ఉద్ధవ్, గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి శకుంతల, అదనపు గిరిజన అభివృద్ధి అధికారి చిరంజీవి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి అష్ఫాగ్ అహ్మద్, గిరిజన సంక్షేమ క్రీడల అధికారి షేకు, ఉపాధ్యాయుడు జంగు, ఇతర అధికారులు, పాఠశాల సిబ్బంది మరియు శిక్షకులు విద్యా సాగర్, అరవింద్, తిరుమల్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.