మంథనిలో ఘనంగా శ్రీనుబాబు జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి
మంథని,(విజయక్రాంతి): మంథనిలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సోదరులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రక్తదానం చేసి రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈసందర్బంగా మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పెంటరి రాజు, మారుపాక నిహారిక, ఎల్లంకి వంశీ, పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, యువజన కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్, కౌన్సిలర్లు పెంటరి రాజు, మారుపాక నిహారిక, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మాజీ చైర్ పర్సన్ శ్రీరoభట్ల సంతోష్,
రాష్ట్ర విద్యుత్ బోర్డ్ సభ్యుడు శశి భూషణ్ కాచే, మాజీ ఎంపీపీ కొండ శంకర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, పార్టీ సీనియర్ నాయకులు బండ కిషోర్ రెడ్డి, మంథని సత్యం, మంథని రాకేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయ సాదనలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తోడుగా సోదరుడు శ్రీనుబాబు నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలలో తోడు ఉంటున్నారని వారు గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిత్యం పని చేస్తూ, ఆపదలో ఉన్న వారికి ఆపద్బoదవుడు శ్రీను బాబు అని అన్నారు. అర్ధరాత్రి యువతకు విద్య,ఉద్యోగ, రాజకీయ రంగాలలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న నిస్వార్ధ సేవకుడు శ్రీనుబాబు అని వాడు కొనియాడారు.




