గొల్లపల్లి ఘటనపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
ఎస్పీతో ఫోన్లో మాట్లాడి గజఈతగళ్ళను పిలిపించాలని కోరిన ఎమ్మెల్యే
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి
జడ్చర్ల: మండలంలోని గొల్లపల్లి గ్రామంలోనీ చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గల్లంతైన దుబ్బ నవీన్(30),ఎడ్ల యాదగిరి(24) ఆచూకీ ఇంకా లభించకపోవడం పట్ల జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్పీ జానకితో ఫోన్ ద్వారా మాట్లాడి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసి, మృతదేహాలు లభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే తక్షణమే గజఈతగళ్ళను పిలిపించాలని ఎమ్మెల్యే కోరారు. అవసరమైన సిబ్బంది మరియు పరికరాలతో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగించాలని కోరారు.ఈ దుర్ఘటనలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ ఘటన త్వరగా ముగిసి గల్లంతైన వారు లభించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.




