16 April, 2026 | 9:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

జేఈఈ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ ఆధిపత్యం

02-06-2025 11:56 PM

ఓపెన్ క్యాటగిరీలో టాప్ టాప్ లోపు అత్యధిక ర్యాంకులు 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): సోమవారం విడుదలైన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో మరో సారి మెరిశారు. ఆలిండియా మొదటి ర్యాంక్‌తో పాటు, ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియా 3, 5, 6, 11 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

300కి 300 మార్కులతో వంగాల అజయ్‌రెడ్డి ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించాడు. ఇంకా ఆలిండియ ఓపెన్ కేటగిరీలో జీ రుత్విక్ సాయి ఆలిండియా మొదటి ర్యాంక్, మాజిద్ హుస్సేన్ 3వ ర్యాంక్, ఉజ్వల్ కేసరి 5వ ర్యాంక్, అక్షత్ కుమార్ చౌరాసియ 6వ ర్యాంక్, అర్ణవ్ నిగమ్ 11వ ర్యాంక్, దేవ్‌దత్త మాఝీ 16వ ర్యాంక్, రుత్విక్ సాయి 18వ ర్యాంక్, వంగాల అజయ్‌రెడ్డి 19వ ర్యాంక్ సాధించాఉ.

ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10 లోపు 3 ర్యాంకులతో పాటు, 20 లోపు 7 ర్యాంకులు, 50 లోపు 19 ర్యాంకులు, 100 లోపు 29 ర్యాంకులు సాధించారు. ఈసారి కూడా ఐఐటీల్లో మొదటి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం శ్రీచైతన్య విద్యార్థులదేనని ఈ సందర్భంగా విద్యాసంస్థల సీఈవో, అకడమిక్ డైరెక్టర్ సుష్మ హర్షం వ్యక్తం చేశారు. దీనంతటికి కారణమైన దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందించడమేనని చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది సుష్మ అభినందించారు.