16 April, 2026 | 7:21 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన తెలంగాణ..

02-06-2025 11:40 PM

మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్...

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి రామన్న ధ్వజం..

అదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇస్తే వచ్చింది కాదని తమ నేత కేసీఆర్(KCR) ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చుకున్నదనీ మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna) అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని(Telangana State Formation Day) పురస్కరించుకొని ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఉత్సాహంగా వేడుకలు జరిగాయి. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండాతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం అమరవీర స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించి పూలమాలతో గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల శతాబ్దాల కళ నిజం చేసే దిశగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి స్వరాష్ట్ర సాధనను రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాకముందు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండి పోయామన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. తెలంగాణ లో బాధ్యతాయుతమైన పరిపాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో  ప్రజలను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ లు తదితరులు పాల్గొన్నారు.