30 June, 2026 | 11:01 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

శ్రీ మాత నిమిషాంబ దేవి ఆలయ.. 2026 వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ

01-12-2025 12:14 AM

మేడిపల్లి, నవంబర్ 30 (విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీ సోమవంశ క్షత్రియ నకాష్ కులస్తుల కులదేవత అయిన శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆల యం, బోడుప్పల్,  సంచాలితము.. శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య  మహా సంస్థానము, హంపి పీఠం,తెలంగాణ రాష్ట్ర నకాష్ సంఘం యొక్క 2026 వార్షిక క్యాలెండర్ ను బీ.సీ డెడికేషన్ కమిషన్ ప్రత్యేక చైర్మన్  భూసాని వెంకటేశ్వర రావు, మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఆల య చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు, లచే ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు & మాజీ కార్పొ రేటర్ శ్రీ పోగుల నర్సింహా రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు : చీరల నరసింహ, శ్రీ దానగళ్ళ యాదగిరి, ఆలయ ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్ , ట్రస్ట్ ధర్మకర్తలు : ఎమ్. శ్రీనివాస్ రావు, బి. హేమచందర్, ఎమ్. సాయి బాబా (శ్యామ్), రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, వై. చంద్రశేఖర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్ ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.