calender_icon.png 1 December, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

01-12-2025 12:15:27 AM

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 30:  జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి  ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు.  ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు.

వనపర్తి టౌన్

వనపర్తి టౌన్, నవంబర్ 30 : గ్రామపంచాయతీ  ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక  ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు మెంబర్  ఎన్నికలు పూర్తయి, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని తెలిపారు.