28 March, 2026 | 11:28 PM

ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం

28-03-2026 09:36 PM

సూర్యాపేట,(విజయక్రాంతి):  జిల్లా కేంద్రంలోని శ్రీ వేదాంత భజన మందిరంలో శనివారం వైభవోపెతంగా సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకం నిర్వహించారు. రాజాధి రాజుగా స్వామివారు దర్శనమిచ్చారు. మహా పట్టాభిషేకం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు స్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని చూసి పులకించిపోయారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వాహనంలో సూర్యాపేట పట్టణంలో పూర వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.