28 March, 2026 | 11:28 PM

లోక్ అదాలత్‌లో 5,454 కేసుల పరిష్కారం

28-03-2026 09:33 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 5,454 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ ను న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ఛైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. సంతోష్ కుమార్ కలిసి ప్రారంభించారు. 5,353 క్రిమినల్, 20 సివిల్ 11 మోటారు ప్రమాదాలు, 70 బ్యాంకు పీఎల్సీ  కేసులు పరిష్కారమయ్యాయి. ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వై. జయప్రసాద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి  బి.సాధన, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి  వి.తరణి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎ. కాంతారావు, న్యాయవాదులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.