20-01-2026 12:00:00 AM
సనత్‌గర్, జనవరి 19 (విజయక్రాంతి): నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్‌స్పె క్టర్ డీ. శ్రీనివాస్ రెడ్డి సోమవారం సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ నేరాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ సమస్యలపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.