3 March, 2026 | 6:58 AM

ఘనంగా శ్రీపాదరావు జయంతి

03-03-2026 12:07 AM

ముకరంపుర, మార్చి 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని జి ల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు.

కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో గల శ్రీపాదరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా చై ర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏ ర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి జి ల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత దుద్దిల్ల శ్రీపాద రావు గారి జయంతి వేడుకలు జిల్లా కాం గ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలో పలుచోట్ల ఘనంగా జరిగాయి.

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రా జశేఖర్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వత మ ల్లేశం, వరాల నర్సింగం, గుమ్మడి రాజ్ కు మార్, పూలమాలలు వేసి ఘనంగా నివాళు లు అర్పించారు. సుధా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రానికి కాక ప్రతి ఒక్క ప్రాంతానికి సేవలు చేస్తూ, అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందినారని, పలువురికి ఆదర్శంగా నిలిచినారని అన్నారు.

ఆయన చూపిన బాటలో పయనిస్తామని ప్రతిన భూనుతు, వారి మరణాంతరం వారి తనయుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు వారి ఆశయాలను కొనసాగిస్తూ, వారు చూపిన బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుపొందినారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న రాజ మల్లయ్య , గుండాటి శ్రీనివాస్ రెడ్డి, టేల భూమయ్య, ఆకుల ఉదయ్, మంద నగేష్ ముదిరాజ్, మూల కృష్ణారెడ్డి, వంగల విద్యాసాగర్, విక్టర్, నాగుల సతీష్, చెర్ల పద్మ, పంజాల స్వామి గౌడ్ , దిండుగాల మధు, మూల జయపాల్ , మాదాసు శ్రీనివాస్,సత్తినేని శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.