3 March, 2026 | 3:41 AM

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులకు సన్మానం

03-03-2026 12:07 AM

ఎన్జీవో, అధికారుల సంఘం

ఎల్లారెడ్డి, మార్చి 2 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్  పద్మ శ్రీకాంత్  మరియు వైస్ చైర్మన్ శ్రీమతి మత్తమాల భాగ్యవతి తో పాటు వార్డు కౌన్సిలర్లకు  (టీఎన్జీఓస్) ఎల్లారెడ్డి యూనిట్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మైపాల్,ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీఓస్ ఎల్లారెడ్డి యూనిట్ అధ్యక్షులు శ్రీ లచ్చిగారి మహిపాల్  అధ్యక్షత వహించగా, కార్యదర్శి.,శరణ్ కుమార్  సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు  లచ్చిగారి మహిపాల్  మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్  శ్రీకాంత్  మరియు వైస్ చైర్మన్ శ్రీమతి మత్తమాల భాగ్యవతి  నాయకత్వంలో ఎల్లారెడ్డి పట్టణం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో యూనిట్ కోశాధికారి శ్రీ యు. రవీందర్, ఉపాధ్యక్షుడు,రాజా గౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీ జె. శ్రీకాంత్, మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి జె. వసంత లక్ష్మి, మహిళా సంయుక్త కార్యదర్శి శ్రీమతి డి. స్వాతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ మహేష్ కి  సన్మానం

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన, ఎన్ జి ఓ ఎస్ అధికారులు. తర్వాత ఘనంగా సన్మానించి సత్కరించారు.