14 April, 2026 | 4:18 AM

శ్రీపాదరావు సేవలు మరువలేనివి

14-04-2026 12:52 AM

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, ఏప్రిల్13(విజయక్రాంతి): స్వర్గీయ శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని రా ష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ పాదరావు చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి లక్ష్మణ్ కుమార్ నివాళ్లులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మారు మూల మంథని ప్రాంతంలోని ధన్వాడ గ్రా మంలో జన్మించిన శ్రీపాద రావు సర్పంచ్ గా, మంథని సమితి ప్రెసిడెంట్ గా , మంథని ఎమ్మెల్యేగా సేవలు అందించారని మంత్రి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేసి స్పీకర్ పదవికి వన్నెతెచ్చిన గొప్ప నేత శ్రీపాద రావు అని అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలివీడిగా ఉంటూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారని మంత్రి అన్నారు.

తం డ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నా రు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ధర్మపురి ప్రజల పక్షాన వారికి నివాళులు అర్పి స్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తో ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.