శ్రీపాదరావుకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళి
నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
కరీంనగర్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంతో పాటు నగరంలోని బస్టాం డ్ కూడలి వద్ద నివాళులర్పించారు. మొదట డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద ర్ రెడ్డి హాజరై మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ లతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బస్టాండ్ కూడలి వద్ద శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం మాట్లాడుతూ..అజాతశత్రువు ప్రజలు మెచ్చిన నేత శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిం చడం జరుగుతుందన్నారు.
ఆయన శాసనసభ స్పీకర్ గా రాష్ట్ర రాజకీయాలను ప్రభా వితం చేసిన నేతగా, ప్రజాప్రతినిధిగా మారుమూల గ్రామంతో పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమాలలో నాయకులు మల్లికార్జున రాజేందర్, ఎండి తాజ్, కర్ర రాజశేఖర్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నరసింగం, పడుశెట్టి భూమయ్య, వేల్పుల వెంకటేష్, ఆకుల నరసయ్య, గుమ్మడి రాజకుమార్, పర్వత మల్లేశం, చాడ గొండ బుచ్చి రెడ్డి, సరిల్లా ప్రసాద్,కామ్రెడ్డి రాంరెడ్డి, చర్ల పద్మ, మునిగంటి అనిల్ నిహాలైమ్మద్, వంగల విద్యాసాగర్, సుధాకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.






