దివ్యాంగులకు ఎస్‌ఆర్‌ఆర్ చేయూత
25-06-2024 04:31 AM
- బ్యాటరీ వాహనాలు పంపిణీ చేసిన అధినేత శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, జూన్‌౨౪ (విజయక్రాంతి): దివ్యాంగులకు ఎస్‌ఆర్‌ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపెర్స్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి చేయూత నిచ్చారు. సోమవారం జెక్ కాలనీలోని కార్యాలయం వద్ద ఫౌండేషన్ తరఫున వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర సేవలు చేస్తామని తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన పలువురు నడవలేని స్థితిలో ఉన్న ౨౦ మందికి బ్యాటరీ వాహనాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉన్నదని చెప్పారు.






