29 July, 2026 | 12:11 AM

సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తా

25-06-2024 04:27 AM
  • ఆరోగ్యశ్రీ సిబ్బందితో మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది వేతనాలు, ఆరోగ్య మిత్రల కు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సౌర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు సోమవారం మంత్రిని కలిశారు.

16 ఏళ్ల నుంచి పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యమిత్రలను ఇతర ప్రదేశాలకు బదిలీ చేశారని, వారిని తిరిగి పీహెచ్‌సీల్లోనే నియమించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా కల్పించాలని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందించాలని విజ్ఞప్తిచేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, ప్రధాన కార్యదర్శి కుమార్, నాయకులు తాళ్ల నాగేశ్‌గౌడ్, తుమ్మల రాజు, వజ్ర, నాగరాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.