21 April, 2026 | 10:01 PM

ఘనంగా పునీత పేతురు ఆలయ మహోత్సవం

21-04-2026 08:35 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డెపల్లిలోని పునీత పేతురు దేవాలయ (చర్చి) 47వ మహోత్సవం మంగళవారం అత్యంత ఘనంగా నేత్ర పర్వంగా జరిగింది. క్రైస్తవ మత పెద్దలు, పీఠాధిపతులు, పాస్టర్ల ఆరాధనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వడ్డెపల్లి పుర వీధుల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో తరలి వచ్చి భక్తి ప్రపత్తులతో గీతాలాపనలు చేశారు. వరంగల్ పీఠ పాలనాధికారి దుగ్గింపుడి విజయ్ పాల్, ఇన్చార్జి విచారణ గురువు జి. అనుకిరణ్, చర్చి అధ్యక్షుడు నల్ల ప్రవీన్, సెక్రటరి ఇనుముల దయాకర్, వైస్ ప్రెసిడెంట్ నల్ల విజయ్ పర్యవేక్షణలో చర్చిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తి కీర్తనలు. గీతాలాపనలు, హోసన్న గీతాలను ఏసు ప్రభువును స్థుతిస్తూ ఆలాపించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు.