18 August, 2026 | 1:46 AM

ఆలయంలో తొక్కిసలాట

18-08-2026 12:53 AM
  1. ఏడుగురు మహిళా భక్తుల మృతి
  2. బీహార్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో ఘటన

పాట్నా, ఆగస్టు 17: బీహార్‌లోని అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో సుమారు ఏడుగురు మహిళా భక్తులు మరణించగా, మరో 12మందికి పైగా గాయపడగా వారిలో ముగ్గురిని అత్యవసర చికిత్స నిమిత్తం కోసం పాట్నాకు తరలించారు. అలాగే మృతుల వివరాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేశారు.

ప్రత్యక్ష సాక్షుల మేరకు లఖీసరాయ్ జిల్లా అశోక్‌ధామ్ ఆలయంలో భక్త జన సందోహాన్ని నియంత్రించడంలో విఫలమవడం, అలాగే అక్కడ వెదురుతో బలపరిచిన బారికేడ్ కూలిపోవడంతో విద్యుత్ స్తంభం పడిపోయి కరెంటు ప్రవహిస్తందన్న వదంతుల కారణంగా ఈ తొక్కిసలాట జరిగింది. హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం సోమవారం నాడు భక్తులతో నిండిన రెండు రైళ్లు లఖీసరాయ్ రైల్వే స్టేషన్‌కు ఒకే సమయంలో చేరుకున్నాయని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. 

లఖీసరాయ్ సదర్(పట్టణ) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను ముంగేర్ డివిజనల్ కమిషనర్ ప్రేమ్ సింగ్ మీనా, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాకేష్ కుమార్ పరామర్శించారు.  తొక్కిసలాటలో ప్రాణాలు కో ల్పోయిన వారి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  తీ వ్ర విచారం వ్యక్తం చేశారు.  కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి, మాజీ సీఎం నితీష్‌కుమార్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.