17-02-2026 12:45:34 AM
హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం విశ్వనగరంగా శరవేగంగా విస్తరిస్తోం ది.. ఇక్కడి మత సామరస్యం, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతే ఇందుకు ప్రధాన కార ణం.. ఈ ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. నేర రహిత సమాజ స్థాపనలో పీస్ కమిటీ సభ్యు లు పోలీసులకు, ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిలా నిలవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చా రు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగా ణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో సెంట్రల్ పీస్,
వెల్ఫేర్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనార్ కమిటీ సభ్యులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో 1984లో ఏర్పాటైన పీస్ కమిటీలు దశాబ్దాలుగా శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నా యని గుర్తుచేశారు. క్లిష్ట సమయాల్లో పోలీసులకు అండగా నిలుస్తూ, సామాన్య ప్రజల్లో భరోసా నింపడంలో కమిటీ సభ్యుల కృషి వెలకట్టలేనిదని కొనియాడారు.
నేడు హైదరాబాద్ ప్రపంచ పటంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటే, అందులో పీస్ కమిటీలతో పాటు శాంతికాముకులైన నగర పౌరుల సహకారం ఎంతో ఉందన్నారు.రాబోయే పం డుగలను అన్ని వర్గాల ప్రజలు సోదరభావం తో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పీస్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వ యం చేసుకోవాలని సీపీ సూచించారు.
ప్రస్తుత సాంకేతిక యుగంలో సోషల్ మీడి యా వేదికగా వచ్చే అసత్య ప్రచారాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేలా, ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వచ్చే పుకార్లను నమ్మవద్దని, వాస్తవాలను ప్రజలకు వివరించడంలో సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరిం చాలని స్పష్టం చేశారు. నగరంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని సమూలంగా అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
అలాగే రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల సామాన్య ప్రజలను చైతన్యపరచడంలో సభ్యు లు చొరవ చూపాలని కోరారు. ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక బంధాన్ని బలోపేతం చేస్తూ, హైదరా బాద్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు డిజోయల్ డేవిస్, ఎస్‌ఎంవిజయ్ కుమార్, ఎన్ శ్వేత, పలు జోన్ల డీసీపీలు రక్షిత కృష్ణ మూర్తి, ఖరే కిరణ్ ప్రభాకర్, శిల్పవల్లి, ఎ.రమణా రెడ్డి, బి.రాజేష్, జి. చంద్ర మోహన్, ఎస్. శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెడ్గే, కాజల్, అవినాశ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీకిషన్ శర్మ, వివిధ జోన్ల అధ్యక్షులు, సభ్యు లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.