బుట్టబొమ్మ ఘాటు కౌంటర్!
సోషల్ మీడియా ట్రోలర్స్‌కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గట్టి షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా నెట్టింట జరుగుతున్న ప్రచారాలపై మౌనం వీడి, తనదైన శైలిలో సింహస్వప్నమై గర్జించింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నా, సినిమా రిలీజ్ రోజున వారంతా థియేటర్లకు రారని ఆమె కుండబద్దలు కొట్టింది.
కేవలం 5 మిలియన్ల ఫాలోవర్లు ఉండి కూడా థియేటర్లలో వందల కోట్ల కలెక్షన్లు రాబట్టే నటులే నిజమైన సూపర్‌స్టార్స్ అని స్పష్టం చేసింది. నటీనటు ల విజయాన్ని సోషల్ మీడియా అంకెలు డిసైడ్ చేయలేవని, ప్రేక్షకులే తమకు సర్వస్వమని ట్రోలర్ల నోళ్లు నొక్కేసింది. అభిమా నులు దేవుళ్లతో సమానమని, వారి వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని, ప్రతి క్షణం అందరికీ రియాక్ట్ అవలేకపోవచ్చని, అందుకే సెలబ్రిటీలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అని పూజా హెగ్డే మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.






