14 March, 2026 | 8:32 PM

షూటింగ్ ప్రారంభం

12-11-2024 12:00 AM

సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధడక్ 2’. 2018లో వచ్చిన ధడక్‌కు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూర్తి స్థాయి ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ధడక్‌లో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించారు. ధడక్ 2లో సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. తాజాగా ఈ సీక్వెల్‌కి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. సిద్ధాంత్, త్రిప్తిలు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షాజిద్ ఇక్బాల్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల కానుంది.